రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామంలోని గీతాంజలి మోడల్ స్కూల్ లో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు పోతురాజు వేషాలు, విద్యార్థినులు అమ్మవారి వేషాలతో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించినారు. అనంతరం విద్యార్థిని విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.