నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని చంద్రయ్యపల్లి
గ్రామానికి చెందిన గడ్డమీది చేరాలు గౌడ్ మల్లంపల్లిలోని తాటివనంలో తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారీ పడడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.వెంటనే గమనించిన తోటి గీత కార్మికులు చికిత్సా నిమిత్తం అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.ప్రమాదవశాత్తూ తాడిచెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలపాలైన గడ్డమీది చేరాలు
గీతవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుండెబోయిన రమేష్ గౌడ్,కందుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.గీత కార్మికుని కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.