నడికూడ,నేటి ధాత్రి :
మండలంలోని వరికోల్ గ్రామంలో భేటి బచావో, బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా గురువారం ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రోజారాణి,శ్రీదేవి ఆధ్వర్యంలో బాలిక జన్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని చెక్క అనిల్ – అఖిల దంపతుల కుమార్తెకు ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో బారసాల కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా తల్లిదండ్రులకు బిడ్డకు కొత్తబట్టలు బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెన్నెల మహిళ సాధికారత అధికారి ఎం. మానస అంగన్వాడి టీచర్లు పోశాల రజిత, పూలరాణి, గండ్ర రజిత, సుమలత సుజాత,సుగుణ,భాగ్యలక్ష్మి, శ్యామలత, రాజేశ్వరి, హేమలత, సూర్య కళ, ఆశ కార్యకర్తలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.