Illegal Construction Under High-Tension Wires Raises Safety Concerns
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ నిర్మాణదారులు పట్టించుకోని జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ అధికారులు
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి
మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ లో హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు మరియు ఇది ప్రభుత్వ భూమి అని తెలుస్తుంది ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్న అక్రమ నిర్మాణదారుడు కనీసం అటువైపు తొంగి చూడని అధికారులు
హై టెన్షన్ వైర్ల కింద బారి ఎత్తున
నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పనికొరకు అమాయక కూలీలు తెలియక వస్తున్నారు ఇట్టి హై టెన్షన్ వైర్లకు చాలా ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది దాదాపు 7 8 మీటర్ల దూరం నుండి వాటి ప్రభావం చూపుతుంటాయి అయితే ఇట్టి వైర్ల కిందనే నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పైన ఉన్న హై టెన్షన్ వైర్లకు దూరం చాలా తక్కువ అసలు హై టెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపట్టకూడదు అని నిబంధనలు ఉన్నప్పటికీ ఇట్టి నిర్మాణదారులు ఏలాంటి అనుమతులు తీసుకోకుండా అధికారులను మరియు ఫిర్యాదుదారులను మభ్యపెట్టి భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపడుతున్నాడు కావున అధికారులు పరిశీలించి వెంటనే ఇట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు
