టీసి ఉద్యోగం ఇప్పిస్తామని వరంగల్లో నిరుద్యోగ యువకుడి నుండి 18లక్షలు వసూలు?
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
డూప్లికెట్ రైల్వే ఆఫర్ లెటర్.., రైల్వే టిసి పేరుతో డూప్లికేట్ ఐడి కార్డులు…
సొంత పిన్ని భర్త సూత్రధారి? కుటుంబం మొత్తం పాత్రధారులు?
పిర్యాదు చేసిన పట్టించుకోని మిల్స్ కాలనీ పోలీసులు? రెండేళ్లుగా తిప్పుతున్నట్లు బాధితుడి ఆవేదన?..
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
రైల్వేలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. వరంగల్ కాశిబుగ్గకు చెందిన గడ్డం రామ్ కుమార్ అనే నిరుద్యోగ యువకుడు తన సొంత పిన్ని భర్త అయిన శివనగర్ కు చెందిన సముద్రాల పూర్ణచందర్ అతని ద్వారా పరిచయమైన వనపర్తి దయాకర్ అను ఇరువురు వారికి ఢిల్లీ లెవల్ లో పరిచయాలు ఉన్నాయి అని చెప్పి, రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పగా వారి మాటలు నమ్మిన సదరు యువకుడు తన జాగకు సంబందించిన పేపర్లను వాళ్ళే కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పెట్టి లోను తీసుకుని డబ్బులు తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనతో పాటు మరికొంత మంది నిరుద్యోగులను కూడా రైల్వేలో టిసి జాబులు ఉన్నాయి అని చెప్పి, తమకు తెలిసినా ఆంధ్రప్రదేశ్ ఎంపీ ద్వారా జాబులు పెట్టిస్తాం అని వనపర్తి దయాకర్, సముద్రాల పూర్ణచందర్ చెప్పిన మాటలు నమ్మి తన లాగే వేరే యువకులు కూడా డబ్బులు ఇచ్చినట్లు యువకుడు మీడియాతో తెలిపాడు. వీళ్ళు చేసిన మోసానికి అందులో తేలి శ్రీనివాస్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తన సొంత పిన్ని భర్త కావడంతో అతను అడిగినంత డబ్బులు తీసుకొని వచ్చి దాదాపు 18 లక్షల రూపాయలు ఇచ్చినట్లు నిరుద్యోగ యువకుడి ఆవేదన. చివరికి ఇంట్లో ఉన్న నగలను సైతం కుదువబెట్టి డబ్బులు తీసుకువచ్చి సదరు వ్యక్తులకు ముట్ట చెప్పినట్లు నిరుద్యోగ యువకుడు మీడియా ముందు వాపోయారు. తన పిన్ని భర్త సముద్రాల పూర్ణచందర్, వనపర్తి దయాకర్లు కలిసి ఢిల్లీ లెవెల్ లో పరిచయాలు ఉన్నట్లు నమ్మించి బాధితుల నుండి డబ్బులు తీసుకొని, తీరా టైంకి ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు ఎక్కడా అని బాధితులు నిలదీయగా రేపు మాపు అంటూ యేండ్ల తరబడి తిప్పుతున్నారని బాధిత యువకుడి ఆవేదన. ఆఫర్ లెటర్లు, ఐడి కార్డులు నకిలీవి అని తేలడంతో అవక్కయారు సదరు బాధితులు. తన సొంత పిన్ని భర్త (బాబాయ్) సూత్రధారి అని, అతని కుటుంబం మొత్తం (కూతురు అల్లుడు) పాత్రధారులుగా ఉన్నారని బాధిత యువకుడు ఆవేదన తెలియచేశారు. తాను మోసపోయానని గ్రహించి తన డబ్బులు తనకు ఇవ్వాలని, పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు సదరు యువకుడు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా కానీ డబ్బులు ఇవ్వట్లేదు అని, డబ్బులు అడిగితే స్థానిక రాజకీయ నాయకులతో, తనకు తెలిసిన పోలీసు అధికారులతో బెదిరించడం, కేసులు వాపస్ తీసుకుంటే డబ్బులు ఇస్తామని బెదిరించడం, తన బాబాయ్ చేసేది ఆటోడ్రైవర్ వృత్తి అయిన స్నేహితుల పరిచయాల తోటి ఎలాంటి కేసులు కాకుండా పోలీస్ స్టేషన్లలో మేనేజ్ చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధిత నిరుద్యోగ యువకుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ అధికారులను కోరారు. వరంగల్ తూర్పు కారు పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ తాను సెటిల్ చేస్తా తన దగ్గరికే రావాలి అంటూ యువకుడిని ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే జిల్లా మంత్రికి పిర్యాదు చేయనున్నట్లు సమాచారం.