వైద్యా కళాశాలలో తరగతుల ప్రారంభానికి సిద్దం.

#జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

# ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి తరగతుల ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ అధికారులతో కలసి నూతనంగా నిర్మించిన జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్,పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల నిర్వహణ, ర్ఆస్పత్రిలో సేవలందించేందుకు అవసరమైన బోధన,బోధనేతర సిబ్బంది,ఇతర మౌళిక వసతులు,పరికరాలు సమకూర్చుకొని ఈ విద్యా సంవత్సరం నుండి వైద్య తరగతులు,వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ను కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ దాస్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పుష్పలత, టిజిఎం ఐడిసి ఈఈ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!