
M Srinivas IFTU State General Secretary.
లేబర్ కోడ్స్ రద్దు…పని గంటల తగ్గింపుకై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి.
ఎం శ్రీనివాస్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు పని గంటల తగ్గింపు కనీస వేతనాలపై మరిన్ని సమరసిల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
2025 ఆగస్టు 4న అమీనాపురంలో జరిగిన ఐ ఎఫ్ టి యు మహబూబాద్ జిల్లా కమిటీ సమావేశం కు హాజరై జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల కు అనుకూల విధానాలను రూపొందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ముమ్మరం చేసిందనీ అన్నారు. ముఖ్యంగా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల భాగంగా రైతులకు భూమిపై హక్కులు నిరాకరిస్తూ కార్మిక వర్గానికి ఉన్న మౌలిక హక్కులను రద్దు చేస్తూ మూడు నెలల సాగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ ను ముందుకు తెచ్చిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా దాని ఆధారంగా వచ్చిన చట్టాలను భారత ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను బుట్ట దాఖలు చేస్తూ కనీస వేతనాలను సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితులు వర్ణనాతీతం అని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెలు చేపట్టిందని దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలపై కార్మిక వర్గం బలమైన సమస్యల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆగస్టు 16 17 తేదీలలో కేసముద్రం మండల కేంద్రంలో జరిగే ఐ ఎఫ్ టి యు రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆ మేరకు తగిన ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆగస్టు 16 17 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల నిర్మాణపు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా కార్మికులు వ్యాపార వాణిజ్య వర్తక వర్గాలు సహకరించి తోడ్పడవలసిందిగా శ్రీనివాస్ కోరారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వత కోటేష్, శివారపు శ్రీధర్, సీనియర్ నాయకులు హెచ్ లింగ్యా, ఏపూరి వీరభద్రం,
ఎం నాగేశ్వరరావు,
జబ్బార్,తేజావత్ శోభన్,
అల్లి యాకాంబరం బట్ట మేకల రాజు, మిట్ట గడుపుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.