
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్
మందమర్రి, నేటిధాత్రి:-
పరీక్షల్లో విద్యార్థులందరూ ఒత్తిడిని అధిగమించి, మంచి ఫలితాలు సాధించాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదోవ తరగతి విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం పరీక్ష ప్యాడ్లు, పన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ, సొసైటీ ఆధ్వర్యంలో సేవ చేయాలన్న దృక్పథంతో దాతలు సంప్రదించాలని, వారి సహాయం చేయలనే హృదయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ఎవరైనా సహాయం చేయాలనే ఆలోచన ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులను పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పట్టణ అధ్యక్షుడు నదిపాట రాజు, జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఓరం కవిరాజు, సభ్యులు ఎండి జావిద్ పాషా, మామిడి అజయ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.