పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973-74 సంవత్సరంలో 10వ తరగతి పూర్తిచేసి స్వర్ణోత్సవ వార్షికోత్సవం పూర్తైన సందర్భంగా ఆ బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు 8 S-మాదిరి కుర్చీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనం వెంకటేశ్వరరావు బహుకరిం చారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్ధుల తరఫున యెంగల బిక్షపతి, వ్యాయామ సంచాలకుడిగా పదవీ విరమణ చేసిన బొల్లోజు కృష్ణమూర్తి,పాఠశాల బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నా రు.పాఠశాల ప్రధానోపాధ్యా యులు పూర్వ విద్యార్ధులను ఉద్దేశించి తాము చదివిన పాఠశాలను గుర్తుంచుకొని మౌళిక వసతుల అవసరాలను గుర్తించి సాయం చేయడం చాలా గొప్ప విషయం అని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.