ఉర్సు దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉర్సు గుట్ట, రంగలీల మైదానం కరీమాబాదులో “దసరా ఉత్సవ కమిటీ” ప్రతిఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2024 దసరా ఉత్సవాల గురించి సోమవారం నాడు దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు అధ్యక్షతన కరీమాబాదు లోని ఆదర్శ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు మాట్లాడుతూ, గత ఏడాది సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకున్నా, దాతల సహకారంతో దసరా ఉత్సవ కమిటీనే సొంత ఖర్చులతో నిర్వహించింది అని తెలిపారు. ఈ యేడాది నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న గౌడ్, సహాయ కోశాధికారి శివమూర్తి, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, ఉపాధ్యక్షులు గోనె రాంప్రసాద్, నాగపురి రంజిత్ గౌడ్, పొగాకు సందీప్, సహాయ కార్యదర్శులు సుంకరి సంజీవ్, పూజారి అజయ్, బొల్లం రాజు, కార్యదర్శులు నాగపురి మహేష్, కత్తెరసాల వేణు, వడ్నాల శ్రీను, నరిగే శీను, సభ్యులు బిట్ల క్రాంతి, గట్టు రమేష్, బత్తిని రవిచంద్ర, నాగపురి నాగరాజు, పార్వతీ కృష్ణంరాజు, వంశీ, వినయ్, రాజశేఖర్, బైరగోని మనోహర్, శ్రీరాముల చరన్, ఎలగందుల కృష్ణమూర్తి, గట్టు బాలసాయి, మహేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!