భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి డివిజన్ జనరల్ బాడీ సమావేశం చంద్రగిరి శంకర్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది ఈ యొక్క జనరల్ బాడీకి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో 2222 కోట్ల రూపాయలు లాభాలు రావడం జరిగినది దీనికిగాను యాజమాన్యం పర్మినెంట్ కార్మికులకు 711 కోట్ల రూపాయలు బోనస్ గా ఇవ్వనున్నది ఈ సందర్భంగా ఈ లాభాల్లో కాంట్రాక్ట్ కార్మిక శ్రమ ఉన్నది తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీరికి కూడా లాభాల బాట సింగరేణి యాజమాన్యం చెల్లించాలని డిమాండ్తో సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కాంట్రాక్ట్ కార్మికులు తమ నిరసన తెలియజేయాలని అదేవిధంగా సింగరేణి ఎన్నికల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏ సమ్మక్క వై శ్యామల ఈ మల్లేష్ వి బిక్షపతి ఎస్ స్వరూప దుర్గం సరూప తదితరులు పాల్గొన్నారు