పరకాల నేటిధాత్రి పరకాల
మండలం నాగారం గ్రామానికి చెందిన దూలం శ్రీనివాస్ గీత కార్మికుడు కుల వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్ర గాయాల పాలు కాగా. ఎడమ చేయి విరగడం జరిగింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న తోటి గీతా కార్మికులు పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కులవృత్తిని జీవనోపాధిగా ఎంచుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న దూలం శ్రీనివాస్ చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలు కావడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.నిరుపేద కుటుంబానికి చెందిన దూలం శ్రీనివాస్ కు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వం వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని నాగారం గ్రామ గీత కార్మిక సహకార సంఘం అధ్యక్షులు ఏరుకొండ సంతోషం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.