
మంచిర్యాల నేటిదాత్రి
తేదీ 28 03 2024 గురువారం రోజు ఉదయం 11:30 గంటలకు మంచిర్యాల పట్టణంలో అంబేద్కర్ భవనం లో జాతీయ మాల మహానాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గజెల్లీ లక్ష్మణ్ అధ్యక్షత వహించారు
జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి దయాకర్ అన్న గారి మరియు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గార్ల ఆదేశాల మేరకు
ఈ సమావేశంలో నస్పూర్ మున్సిపాలిటీ నస్పూర్ అంబేద్కర్ కాలనీకి చెందిన గరిషే రామస్వామి ని మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించారు వారికి నియామక పత్రాన్ని *జిల్లా అధ్యక్షులు గజెల్లి లక్ష్మణ్ జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ఆసాధి పురుషోత్తం గార్లు జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలితపు శంకర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు గార్లు
నియామక పత్రాన్ని అందజేశారు
గతంలో విద్యార్థి యువజన ప్రజా పోరాటాలలో జిల్లా స్థాయిలో మరియు అంబేద్కర్ కోల్ బెల్ట్ ఏరియా ప్రధాన కార్యదర్శి గా
పనిచేసిన అనుభవం సంఘం నిర్మాణంలో అంకిత భావంతో అనుభవాలను గుర్తించి జాతీయ మాల మహానాడు నిర్మాణానికి వారి సేవలను తోడ్పాటు అందిస్తారని వారి సేవలు మాలలకు అవసరమని వారిని నియమించినట్లు తెలియజేస్తున్నాము వారి నియామకం పట్ల జిల్లా మాలలు హర్షం వ్యక్తం చేశారు
అలాగే మంచిర్యాల పట్టణ గోపాలవాడకు చెందిన నీరిటి నర్సయ్య ను మంచిర్యాల పట్టణ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాస్ ఉపాధ్యక్షులు జె నర్సింగ్ M కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు శ్రీనివాస్
జై భీమ్ సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల నరేష్ వివిధ మండలాల అధ్యక్షులు సురిమిల్ల వెంకటేష్ దాసరి ప్రకాశ్,,S లింగయ్య భోగ రాజన్న తదితరులు పాల్గొన్నారు