Focus on Waste Recycling in Narsampet
డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలి
మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్
పాకాల రోడ్డులో డంపింగ్ యార్డ్ సందర్శన
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహించాలని సంబంధిత మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నర్సంపేట పట్టణ శివారులోని మెడికల్ కాలేజ్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపైకి వచ్చిన చెత్తాచెదారాన్ని జెసిబి సహాయంతో తొలగింపజేశారు.ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, దుర్వాసన మరియు అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని, పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్తను సకాలంలో తరలించి శాస్త్రీయంగా నిర్వీర్యం చేయాలని, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా డంపింగ్ యార్డ్ వద్ద సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు క్రమం తప్పకుండా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మాదాసి రవి, అయూబ్ ఖాన్, పొన్నాల మనిషా ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాట ప్రభాకర్, కీసర వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
