గడప గడపకు మోడి లో పాల్గొన్న బిజెపి శ్రేణులు
ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రమైన ఎండపల్లిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గడపగడపకి వెళ్ళి మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో భారతదేశంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మళ్లీ మోదీ సర్కారే రావాలని ప్రచారం చేయడం జరిగింది. ఇందులో బిజెపి జిల్లా నాయకులు కొత్తపేట మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రావు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి మంచికట్ల రవి, గ్రామ శాఖ నాయకులు సామల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు రాయిల్ల నాగరాజు ,కార్యకర్తలు కిరణ్ ,లక్ష్మణ్ , నందు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎండపల్లి లో గావ్ చలో బస్తి చలో కార్యక్రమం
