రెండోసారి బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గంటా రవికుమార్
బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గంట రవికుమార్ రెండవసారి నియమింపబడ్డ సందర్భంగా శనివారం బిజెపి నాయకులతో కలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. గంటా రవికుమార్ ఎన్నికను ఆమోదిస్తూ బిజెపి ఐనవోలు మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శి గుండెకారి కోటేశ్వర్ రావు, జిల్లా కోశాధికారి బోళ్ళపెల్లి మహేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు కోట నర్సయ్య గౌడ్, సూదుల రవీందర్ రెడ్డి, ఆడెపు భాస్కర్, తీగల చంద్రశేఖర్ గౌడ్, నరిగే రాజేష్, గుండబోయిన నర్సింహగౌడ్, వేముల ప్రభాకర్, దండు కిషన్, బర్ల నవీన్, బాల్య రవీందర్, తాళ్లపెల్లి లలిత, సూదుల ఉమారెడ్డి, బిందుశ్రీ, రాజేష్, నాగరాజు, సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.