
Ganta Ravi Kumar
బీజేపీ జెండా ఆవిష్కరించిన గంట రవికుమార్
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ వనమాల కనపర్తి గ్రామంలో మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జాతీయ కౌన్సిల్ మెంబర్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు లు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. వారూ మాట్లాడుతూ,
ఏకాత్మ మానవత వాదాన్ని మరియు అంత్యోదయ విధానాన్ని రూపొందించి, అందరికీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం జరగాలని ఉద్దేశంతో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలతో అడుగుజాడలలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు చేరే విధంగా, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి బిజెపి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బండి సాంబయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, నరసింహా, పులి సాగర్, మండల ప్రధాన కార్యదర్శి మద్ది రవితేజ, పొన్నాల రాజు, మండల ఉపాధ్యక్షులు నరికే రాజేషు, శక్తి కేంద్ర ఇన్చార్జి రాజేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ , నిఖిల్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు కిరణ్, ప్రభాకర్, రాజేష్, అభిషేక్, సతీష్, నగేష్, రాజు, సాగర్, శివ, రాము మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.