తెలంగాణ లో పోటీ చేయకపోవడంతో రాజీనామా
పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి గన్నోజు శ్రీనివాస చారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతుతెలుగుదేశం పార్టీకి రాజీనామ చేస్తున్న అంటూ వెల్లడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పాల్గొనక పోవడంతో మనస్థాపం చెంది రాజీనామా చేశానన్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత పరకాల నియోజకవర్గంలో తనకు అధిష్టానం బాధ్యతలు అప్పగించి అప్పటినుండి నిర్విరామంగా నియోజకవర్గంలో పార్టీని కార్యకర్తలతో కంటికి రెప్పల కాపాడుకుంటూ ప్రజల గుండెలలో తెలుగుదేశం పార్టీనీ ఉంచానన్నారు.ప్రస్తుత పరిస్థితుల రీత్యా తెలంగాణలో పోటీ చేయలేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు,టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.