భద్రాచలం నేటి ధాత్రి
సారపాకలో 21వ తేదీన సాయంత్రం బూర్గంపాడు ఎస్సై సుమన్ వారి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించగా సాయంత్రం 6:30 అవుతున్న సమయంలో
ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై భద్రాచలం వైపు నుండి అనుమానస్పదంగా అత్యధిక వేగంతో వాహనాన్ని తోలుతూ వస్తుండగా అతివేగంతో వెళ్తున్న వాహనాన్ని సారపాక లోని పల్లె ప్రకృతివనం దగ్గర అడ్డగించి ఆపగా ఆ వ్యక్తి దగ్గర ఉన్న బ్యాగులను సోదా చేయడంతో 15.15 కేజీల గంజాయి ఆ బ్యాగులో లభించడంతో అతని వివరాలు పోలీస్ అధికారులు తెలుసుకొనడంతో ఆ వ్యక్తి పేరు తునికి లక్ష్మయ్య (లక్ష్మణ్ ) తండ్రి రాములు, వయసు 23 సంవత్సరాలు కులము ఎస్టి కోయ, వృత్తి కూలి అల్లిగూడెం గ్రామం, చింతూర్ మండలం అని ఆ వ్యక్తి తెలియజేయడంతో ఆ వ్యక్తి వద్ద ఉన్న గంజాయి మొత్తం 15.15 కేజీలు, స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు దాని విలువ సుమారు 3లక్షల 78, వేల 750 రూపాయలుగా ఉంటుంది అంచనా వేసి అతని వద్ద నుండి టీఎస్ 28 జై 9173 నెంబర్ గల పల్సర్ మోటార్ సైకిల్ ను ఆ ద్విచక్ర వాహనం పై ఉన్న ముగ్గురు వ్యక్తులను వారి వద్ద ఉన్న ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసి, ముగ్గురి మీద కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిగా ఉన్న తునికి లక్ష్మణ్ ని రిమాండ్ నిమిత్తం కోర్ట్ లో హాజరు పరిచినట్టుగా బూర్గంపాడు ఎస్సై సుమన్ పత్రికా ప్రకటనగా తెలియజేశారు