రాష్ట్ర అధ్యక్షులు గడప శ్రీహరి
ఘనంగా గంగపుత్ర 2025 డైరీ ఆవిష్కరణ
నేటిధాత్రి, వరంగల్
గంగపుత్రులు ఐకమత్యంగా ఉంటూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా హక్కులు సాదించుకోవాలని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడప శ్రీహరి, వరంగల్ జిల్లా బెస్త సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తుంగతుర్తి సనత్ అన్నారు. తెలంగాణ ప్రదేశ్ బెస్త (గంగపుత్ర ) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హన్మకొండలోని గంగా గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు పాక ఓంప్రకాష్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధిలుగా హాజరై, వారు మాట్లాడుతూ అనేక కులాలు బీ సీ (ఏ )రిజర్వేషన్ పొందెందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఇందుకు గంగపుత్రులు సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికలు సైతం త్వరలో సమీపిస్తున్నాయని ఇందుకు జిల్లాలో ఉన్న సంఘాలు ఎన్నికలు పూర్తి చేస్తుకోవాలని అన్నారు. గంగపుత్రులు తమ కులవృత్తి మరువకుండా వృత్తిని కొనసాగించాలని అన్నారు. గంగపుత్రులు రాజకీయంగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలన్నారు. గంగపుత్ర జిల్లా సంఘం భవనం
మరమ్మత్తులు చేసేందుకు ఒక కమిటీ వేసి పునరుద్దరణ చేసుకోవాలని డాక్టర్ సనత్ అన్నారు. అనంతరం అతిదులను సంఘం పెద్దలను పూలబొకే అందజేసి శాలువాలతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడబోయిన శివరత్నం, ఏ ఎం సుధాకర్, డోలి శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాక వెంకటేశ్వర్లు, డైరీ కన్వినర్ గోపు సుధాకర్, తులసి కళ్యాణి, పాక శ్రీనివాస్, సింగరం చంద్రయ్య, దామెర శ్యామ్, ట్రస్ట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గోపు సంజీవ్, సాగర్, మైస శ్యామ్ విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు