కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో కొలువైన గంగమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ వెలవలపల్లి వెంకట సురేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోరిన వారి కొంగుబంగారంగా పూజలు అందుకుంటూ యాదవుల ఇలవేల్పుగా నిలిచిన గంగమ్మ తల్లికి సహస్ర గట్టాభిషేకం మరియు అమ్మవారి కుంకుమ పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి యాదవుల ప్రతి ఇంటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మంద గంపలు సమర్పించారు . ఆలయ ప్రాంగణంలో మందేచు కథలు చెప్పడం జరిగింది . తదుపరి అమ్మవారికి బోనాలు పోతురాజుకు గొర్రెపోతుల నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లి ఆలయ చైర్మన్ జడ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ భాగం రూప మాదారం పెద్దగోల్ల కంచం కోటయ్య సారగొల్ల మర్లపాటి శ్రీను మాదారం యాదవుల సంఘం ద్వారా అధ్యక్షుడు బట్టు సంగయ్య బట్టు నరసయ్య బట్టు వెంకటేశ్వర్లు లింగయ్య నరేష్ ,సంజీవరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు కుల పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు