కోటగుళ్ళ లో గంగాధర తాసిల్దార్ అంబటి రజిత పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం అక్షయ తృతీయ పర్వదినానికి పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గంగాధర తాసిల్దార్ అంబటి రజిత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
