
State Volleyball
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గంగాధర విద్యార్థి ఎంపిక
గంగాధర, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మంచి కట్ల నందకిషోర్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బాబు శ్రీనివాస్ తెలిపారు.
ఈరాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరుగుతాయని, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్17 బాలుర జట్టులో నందకిషోర్ అత్యంత ప్రతిభ కనబరిచి బాలుర ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైయ్యాడని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.అనిత కుమారి, ఎంపీడీవో డి.రాము, ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.