
"Clay Ganesh Idol in 54 Minutes Blindfolded"
54 నిమిషాల్లో గణనాథుని ప్రతిరూపం.. కళ్లకు గంతలు కట్టుకుని గణపతి తయారీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 54 నిమిషాల్లో మట్టితో మూడు అడుగుల గణనాథుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని ఆయన హైదరాబాద్ కుషాయిగూడ చక్రిపురం ప్రాంతంలోని తన శిల్పకళ వర్క్‌షాప్‌లో రూపొందించారు.కళ అనేది కేవలం చేతి వృత్తి మాత్రమే కాదు, అది భక్తి, మంచి భావాలు, మనసును హత్తుకునే అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. నేటి యువత, పెద్దలు, పిల్లలు – తమ వృత్తుల్లో ఒత్తిడికి గురయ్యే వారందరూ కళను అభ్యసించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందవచ్చని శిల్పి అన్నారు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. “పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అందరూ మట్టి గణపతులను ఉపయోగించాలని” శిల్పి హోతి బస్వరాజ్ పిలుపునిచ్చారు.