
Ganesh Navaratri Celebrations in Jahirabad
గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలు
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
విగ్నేశ్వరుల నిమజ్జన కార్యక్రమంలో బాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణం లోని భవాని మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారి ఆహ్వానం మేరకు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటి వారు ఎమ్మెల్యే గారిని చైర్మన్ ను నాయకులను సన్మానించారు
ఈ సందర్భంగ ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు గణేశ నవరాత్రి వేడుకలు సాంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో ఐక్యత స్నేహభావాలను పెంపొందించే వేదికలని పేర్కొన్నారు.
అనంతరం నాయకులతో కలిసి వివిధ సంస్కృతిక కార్యక్రమలలో పాల్గొన్న వారికి చిన్నారులకు జ్ఞాపకాలను అందజేశారు భక్తులకు ప్రసాదాన్ని పంచుతూ వివిధ కుల సంఘాలు ప్రసాదా పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప మాజి సర్పంచ్ ప్రభు పటేల్ నాయకులు వెంకట్ రెడ్డి బరూర్ దత్తాత్రి,ఇబ్రహీం సంజీవ్ పవార్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.