గంగాధర, నేటిధాత్రి:
రాబోవు గణేష్ నిమజ్జనాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిదిలో గల అన్ని గ్రామాల గణేష్ మండల నిర్వహికులకు, అర్గానైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపాలను భారీగా వేయకుండా చూసుకోవాలని, నిమర్జనం సందర్భంగా వినాయకులను వాహనాలలో తీసుకొని వచ్చేటప్పుడు ఆరోడ్డు వెంట కలిగి ఉన్నటువంటి కరెంటు వైర్ల దృశ్య అతిభారీ వినాయకులు తీసుకురవోద్దని, వాటివల్ల రాకపోకలు, కరెంటుకు అంతరాయం కలిగించవద్దని, వాటివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అదే విదంగా గ్రామపంచాయతి రోడ్ల పైన ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగే విదంగా గణేష్ మండపాలను నిర్మించవద్దని, సరైన జాగ్రతలు తీసుకుంటూ సరైన స్థలంలో నిమజ్జనం చెయ్యాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించిన, సూచనలు పాటించక పోయిన చట్ట ప్రకారం వారి పైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈకార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.