వనపర్తి నేటిధాత్రి;
వనపర్తి పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలని వనపర్తి పోలిస్ సీఐ నాగభూషణరావు కోరారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద వినాయకుడు విగ్రహాన్ని శోభాయాత్ర ఆపి అంతరాయం కలిగించరాదని సీఐ తెలిపారు. వినాయకుడి ఊరేగింపు సమయంలో వినాయక కమిటీ ఉత్సవ నిర్వాహకులు తాగి శోభయాత్రలో పాల్గొనకుండా వారు దిశా నిర్దేశం చేయాలని సీఐ కోరారు .ఊరేగింపు స సమయంలో కట్టలు తాగి ఈలలు వేయడం బాటసారున వెళ్లే ప్రజలను ఇబ్బందుల గురి చేయడం అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. డీ జే లకు అనుమతి లేదని రాత్రి 10 గంటల లోపు వినాయకుడు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాలని ఈ కోరారు ఊరేగింపు సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు నిష్టతో దాదాపు తొమ్మిది రోజులపాటు వినాయకు డి పూజలు చేసి శోభాయాత్రలో తాగకుండా శాంతియుతంగా జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సీఐ పిలుపునిచ్చారు . ఈ విలేకరుల సమావేశంలో టౌన్ ఎస్ఐ జయన్న పాల్గొన్నారు