
Ganesh Navratri
శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి
సీఐ క్రాంతి కుమార్
భద్రత,బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం
ఎస్ఐ.రమేష్ నాయక్
పరకాల నేటిధాత్రి
పట్టణంమరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని పరకాల సీఐ.క్రాంతి కుమార్,ఎస్ఐ.రమేష్ నాయక్ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.