ఉమ్మడి హనుమకొండ కోర్టులో గణేష్ నవరాత్రి  ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

కొలువుదీరిన గణనాధుడు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇరువురు జిల్లా జడ్జీలు మరియు న్యాయవాదులు

హనుమకొండ, నేటిధాత్రి (న్యాయ విభాగం):-

హనుమకొండ ఉమ్మడి జిల్లా కోర్టులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా కోర్టు ముందు న్యాయవాదులు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అనేక మంది న్యాయవాదులు ఇట్టి కార్యక్రమం లో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఇక్కడ హోమం చేసి వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతారు. న్యాయవాదులు, కోర్టు స్టాఫ్ మరియు జ్యుడీషియల్ ఆఫీసర్లు మరియు కోర్టుకు వచ్చే అనేక మంది కక్షి దారులు ఇక్కడ చేపట్టే అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను న్యాయవాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు జరుపుకుంటారు.గణేష్ విగ్రహ ఏర్పాటుతో కోర్టులో పండుగ వాతావరణం నెలకొంది. ఇట్టి వినాయక విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో హనుమకొండ మరియు వరంగల్ జిల్లా జడ్జీలు రమేష్ బాబు మరియు నిర్మలా గీతాంబ గార్లు మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.జీవన్ గౌడ్ మరియు హనుమకొండ వైస్ ప్రెసిడెంట్ పోషిని రవీందర్, జనరల్ సెక్రటరీ రమేష్ మరియు వినాయక మండలి కమిటీ సభ్యులు సంజీవరెడ్డి, సి ఎచ్ రమేష్, నారాయణరావు, వెంకట్, సురేష్,
కృష్ణరావు, వసంతకుమార్ మరియు ఇతర కమిటీ సభ్యులు, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు

కుటుంబ సమేతంగా పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ రవీందర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!