
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మండలంలో ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేటటువంటి నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ. మండలంలోని వివిధ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు మావద్ద ముందస్తుగా సమాచారం తీసుకుంటే మానిటరింగ్ చేయడం చాలా సులభం అవుతుందని ఇందుకోసం ప్రత్యేకంగా http://policeportal.tspolice.gov.in/index.htm వివరాలు కచ్చితంగా ఆన్లైన్లో ఉండాలని అన్నారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో డీజే లకు ఇలాంటి అనుమతి లేదని అందుకు నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని మండపాల వద్ద విద్యుత్ వినియోగం కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మండపాల వద్ద మైక్ సౌండ్ సిస్టమ్ ఉపయోగించ కూడదని మండపాల వద్ద మద్యం సేవించిన అసభ్యకరమైన నృత్యాలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని. మండపాల వద్ద వీలైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి సందేహం వచ్చిన పోలీస్ శాఖను సంప్రదించాలని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు.