
# అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి.
# కూచిపూడి నృత్య కళాకారిని చిన్నారి సముద్రాల నిధ్యానకు ఘన సన్మానం.
హన్మకొండ,నేటిధాత్రి :
ప్రజల ఐకమత్యానికి గణేష్ ఉత్సవాలు నిదర్శనమని అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి అన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం భావితరాల భవిషత్తు ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయకుల ను పెట్టడమే అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హనుమకొండ పట్టణంలోని ఠాకూర్,హరిహర, సంస్కృత అపార్ట్ మెంట్ వాసుల ఆహ్వానం మేరకు జిల్లా అపార్ట్మెం ట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే
షన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా మట్టివినాయకులతో నవరాత్రి ఉత్సవాలను చేపడుతున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ జరుగుతున్నాయి. హరిహర అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో అదే అపార్ట్మెంట్ కు చెందిన కూచిపూడి నాట్య కళాకారుని,సముద్రాల నిధ్యాన నృత్యం ఎంతగానో ఆకట్టుకున్నది.కాగా చిన్నారి నిధ్యానను జిల్లా అపార్ట్మెం
ట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.అలాగే మట్టి గణపతి విగ్రహంతో నవరాత్రుల ఉత్సవాలు చేపట్టిన హరిహర అపార్ట్ మెంట్స్ అధ్యక్షులు సిహెచ్ సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సముద్రాల కుమారస్వామిలను సన్మానించారు.
జిల్లా అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి మాట్లాడుతూ రాబోయే తరాలకు హానికలిగించే విధంగా ఎలాంటి కార్యక్రమాలలో చేపట్టరాదని పేర్కొన్నారు.వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ముగించుకోవాలని ఆయన సూచించారు.ముందుగా అపార్ట్ మెంట్ వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో జిల్లా ప్రధాన కార్యదర్శి నడుముల విజయ్ కుమార్,అశోక్ రెడ్డి, గుండ్ల శ్రీనివాస్,రాజకుమార్, చిదర అంజనీదేవి,అపార్ట్ మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.