భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ఫక్కీరుగడ్డ,ఆకుదారివాడ లో ఇంటింటి ప్రచారం చేసిన భూపాలపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ది గండ్ర వెంకట రమణా రెడ్డి డప్పు వాయిద్యాలతో, మహిళ మణుల మంగళహారతులతో ఎంతో అట్టహాసంగా సాగిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారం ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధి, కొనసాగుతున్న సంక్షేమం కొనసాగలంటే మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లిలో అభివృద్ధి జరగలేదు నాకు ఒక్క అవకాశం కల్పించాలని వస్తున్న నాయకులకు భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజలే కార్యోన్మోకులై చూపించాలి.
2009లో ఉన్న భూపాలపల్లి 2023 లో ఉన్న భూపాలపల్లి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి.
భూపాలపల్లి పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యగా ఉన్న నీటి సమస్యను, అంతర్గత రోడ్లను పూర్తి చేయడం జరిగింది.
జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లిలో అన్ని జిల్లా కార్యాలయ భవనాలు ఏర్పాటు చేసుకుని పరిపాలన సౌలభ్యం మెరుగు పరిచినం.
ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర గెలుపులో మేము కూడా ఉంటాము అని కదిలిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జనార్ధన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు గౌడ్ కౌన్సిలర్ ఆకుదారి మమత రాయమల్లు దార పుల్లమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు