మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 15
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం అంకుషాపురం గ్రామానికి చెందిన గజ్జి కుమారస్వామి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం రోజున మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గజ్జి కుమారస్వామి యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని మహేందర్ గౌడ్ తెలిపారు. అనంతరం గజ్జి కుమారస్వామి మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తూ..వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి..పరిష్కార మార్గానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కాగా తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న, రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేనన్నలకు గజ్జి కుమారస్వామి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు