వేములవాడ నేటి దాత్రి
ఉద్యమ గాయకుడు గద్దర్ మృతి పట్ల సంతాపం తెలియజేసారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నంది కమాన్ వద్ద అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గద్దర్ చిత్రపటానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారివెంట జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు..