
Gaddar Foundation Honors Choutapalli Poet Praveen
చౌటపల్లి యువకుడి పాటకు గద్దర్ ఫౌండేషన్ గుర్తింపు
పాలధార” పుస్తకంలో ప్రవీణ్ రచనకు స్థానం — గుమ్మడి సూర్యం చేతుల మీదుగా పుస్తకం అందజేత
పర్వతగిరి (నేటిధాత్రి ):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువ కవి గౌరారపు ప్రవీణ్ రచించిన పాటకు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెలువడిన “పాలధార” పుస్తకంలో గౌరవప్రదమైన స్థానం లభించింది. ప్రజా యోధుడు, విప్లవ గాయకుడు గద్దరన్న యాదిలో రచించబడిన ఈ పాలధార సాహిత్య గ్రంథం, ప్రజా సాహిత్యాన్ని ప్రతిబింబించే కవిత్వాల సమాహారంగా నిలిచింది.ప్రవీణ్ రచనకు చోటు దక్కిన సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గద్దరన్న కుమారుడు గుమ్మడి సూర్యం గారు స్వయంగా ప్రవీణ్‌కు “పాలధార” పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సూర్యం గారు మాట్లాడుతూ, ప్రజా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే కొత్త తరపు రచయితలు గద్దర్ ఆశయాలను కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ లాంటి యువ కవులు ప్రజా సాహిత్యానికి నూతన శక్తి అందిస్తున్నారు అని అభినందించారు.ఈ పుస్తకంలో ప్రముఖ కవులు వంటి ప్రసిద్ధ రచయితలతో పాటు ప్రవీణ్ రచన స్థానం పొందడం విశేషంగా నిలిచింది. గౌరవం పట్ల ప్రవీణ్ హర్షం వ్యక్తం చేస్తూ నా పాట ప్రజల మనసులో నాటుకుపోవడం, గద్దర్ అన్న పేరుతో వెలువడిన గ్రంథంలో చోటు దక్కడం నా జీవితంలో గొప్ప గౌరవం” అని తెలిపారు ప్రజల బాధలు సామాజిక అన్యాయాలు సమానత్వం కోసం పోరాడే కవిత్వం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు.
ప్రవీణ్ విజయంతో గ్రామ ప్రజలు యువత సాహిత్య అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు చౌటపల్లి గ్రామంలోని పెద్దలు స్నేహితులు అభిమానులు కలిసి ప్రవీణ్‌ను ఘనంగా అభినందించి . గ్రామస్థులు మాట్లాడుతూ మన ఊరి యువకుడు ఇంత పెద్ద వేదికపై గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం అన్నారు.
పుస్తక సంపాదకులు కూడా ప్రవీణ్ పాటలోని ఆలోచనా లోతు భావన ప్రజా చైతన్యం పట్ల ప్రశంసలు తెలిపారు. గద్దర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇలాంటి కొత్త తరపు కవులు గద్దర్ ఆశయాలకు పునర్జీవం ఇస్తున్నారు అని అన్నారు.
ఈ సందర్భంగా సాహిత్య వర్గాలు మాట్లాడుతూ పాలధార పుస్తకం ద్వారా గ్రామీణ ప్రజా కవులకు గుర్తింపు లభించడం తెలుగు సాహిత్యానికి ఒక మంచి సంకేతం అని అభిప్రాయపడ్డాయి.