ఆర్కె పి కాంగ్రెస్ శ్రేణులు..
రామకృష్ణాపూర్ ,మార్చి 22, నేటిధాత్రి:
పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పార్టీ శ్రేణులు అన్నారు