Gaddam Janardhan Wins Padmashali Association Election
జహీరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా గడ్డం జనార్ధన్
◆-: శాలువాతో సన్మానిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,పట్టణం పద్మశాలి సంఘంలో పద్మశాలి సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి రమేష్ బాబు సహాయ ఎన్నికల అధికారి కోడిపాక నాగరాజు నిర్వహించగా అధ్యక్షుడిగా గడ్డం జనార్ధన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పద్మశాలి సంఘం మొత్తం ఓటర్లు 2006 ఉండగా పోలైన ఓట్లు 1497 ఇందులో గడ్డం జనార్ధన్ 1041 ఓట్లు, దార శ్రీనివాస్ 435 ఓట్లు వచ్చాయి. గడ్డం జనార్ధన్ 606 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందాడు. రిజెక్ట్ అయిన ఓట్లు 21 ఉన్నాయి అని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా గడ్డం జనార్ధన్ మాట్లాడుతూ జహీరాబాద్ పద్మశాలి సంఘానికి రెండవ సారి అధ్యక్షునిగా ఎన్నికైనందున పద్మ శాలి సంఘం అభివృద్ధికి మార్కండేశ్వర మందిర్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియ జేశారు. ఈ ఎన్నికలలో కృషి చేసిన జహీరాబాద్ పద్మశాలి సంఘం సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమ చంద్ర శేఖర్, రంగ అరుణ్, దండి విట్టల్, అప్పం శ్రవణ్, పండల జగదీష్, రాములు నేత, కొండా శివరాజ్, పండాల రమేష్, పండాల కృష్ణ, కె లక్ష్మణ్, అప్పం రమేష్, ప్రభు, గడ్డం పాండు, విజయ్, అప్పం శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
