
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో పురుగు సేవల ప్రక్రియలు చేతి పంపుల మెకానిక్ గా చేరి ఉన్నతాధికారుల సూచనల మేరకు గణపురం మండలం అన్ని గ్రామపంచాయతీలో గల 400 లా పైచిలుకు నీరు అందించేందుకు కృషి చేశారు అతని సేవలను ప్రజలు గుర్తిస్తూ వినియోగించుకుంటున్నారు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నతాధికారుల సలహాలు సూచనలు స్వీకరిస్తూ బిక్షపతి తన పని తాను చేసుకుంటూ ముందుకెళుతున్నాడు ప్రస్తుతం మండలంలో 4 వందల చేతిపంపులు మాత్రమే పని చేస్తూ ప్రజలకు నీటి సౌకర్యం కల్పిస్తున్నారు మండల పరిధిలోని ఏ గ్రామానికి చెందిన చేతి పంపు మొరాయిస్తుందని ప్రజలు గానీ అధికారులతో గానీ తక్షణమే రిపేర్ చేసి నీరు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తాడు అనుటలో ఎలాంటి సందేహం లేదు గత తొమ్మిది నెలల నుండి ఇప్పటివరకు ఆయనకు రావలసిన నెలసరి జీతం సరిగా రాకపోవడం వల్ల ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు ఆయా గ్రామాల ప్రజలు బిక్షపతి సేవలను కొన్ని ఆడుతూ ఆయనకు రావలసిన జీతం వెంటనే చెల్లించి తక్షణమే అతన్ని పొరుగు సేవలో నుండి కాకుండా రెగ్యులరైజ్ పర్మినెంట్ ఉద్యోగిగా గుర్తించి ఆర్థికపరంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని పంచాయతీరాజ్ ఉన్నత అధికారులను ప్రభుత్వాన్ని బిక్షపతి కోరారు