
బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి రిజిస్టేషన్లు రద్దు చేయాలి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడాలో గల సర్వే నెంబర్ 149 లోని ప్రభుత్వ భూమి 58,59 జీవో ను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఇతర వ్యక్తులకు కట్టబెట్టిన వైనం పై గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడంతో శుక్రవారం రోజు స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి శుక్రవారం రోజు సదరు కబ్జా కు గురైన భూమిని పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే గాంధీ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతు గతం లో ఇక్కడ పనిచేసిన రెవిన్యూ అధికారులపై శాఖా పరమైన విచారణ చేపట్టిన అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 58,59 జీవో లను అడ్డం పెట్టుకొని ఎవరి అండతో అధికారులు ఈ అవినీతి కి పాల్పడ్డారో, వారందరి రిజిస్ట్రేషన్ లను రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు.వేరే వేరే వ్యక్తుల ద్వారా డబ్బుల ట్రాన్సక్షన్స్ జరిగాయాని, గజం 3 లక్షల ధర పలికే నానక్ రామ్ గూడ లో కేవలం గవర్నమెంట్ రేటు 27 వేల చొప్పునే వేల గజాల ప్రభుత్వ భూమిని ప్రయివేట్ వ్యక్తులకు ఎలా దారాధత్తం చేస్తారని ప్రశ్నించారు. అధికారుల చేత ఈ పనులు చేయించిన రాజకీయ నాయకులపైన కూడా ఉన్నతాదికారులకు పిర్యాదు చేస్తామని, ఎట్టి పరిస్థితి లోను భూములను వదిలే ప్రసక్తే లేదన్నారు. కబ్జాలకు గురైన భూములను ప్రభుత్వానికి అప్పగించే వరకు విశ్రామించభోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, తిరుపతి ,సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్,శేఖర్,మన్నే రమేష్, అరుణ్ గౌడ్, నర్సింగ్ రావు, గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నేతలు,కార్యకర్తలు,పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.