నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) కమలాపూర్ లో అసంపూర్తి నిర్మాణం లో ఉన్న పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం మరో 50 లక్షల రూపాయలు మంజూరు చేయించవలసిందిగా హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఒదితెల ప్రణవ్ బాబు ను కమలాపూర్ పద్మశాలి సంఘం నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు.వారి విజ్ఞప్తి మేరకు పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తప్పకుండా నిధులు మంజూరి చేయిస్తానని ప్రణవ్ బాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్ కమలాపూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొప్ప శివశంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు దాసి శంకరయ్య, ఎంపిటిసి మెండు రాధికా రమేష్, వావిలాల మురళి, రాఘవులు, దుర్గాప్రసాద్, రాము, తౌటమ్ సుధాకర్, తౌటం ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు