రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు తక్షణమే నిధులను విడుదల చేయాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఏకు కార్తీక్
పరకాల నేటిధాత్రి
గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఏకు కార్తీక్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధం అనే పథకాన్ని ప్రవేశపెట్టి చాలామంది దళితుల జీవితాలలో వెలుగును నింపాయి అలాగే రెండవ విడతలో లబ్ధిదారుల యూనిట్ల ఎంపిక చేసే బాధ్యత గ్రామపంచాయతీలో కార్యదర్శులకు నగర పంచాయతీలో కమిషనర్ కి ఇవ్వడం జరిగిందన్నారు.వారు కూడా సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు యూనిట్ల ఎంపికను పూర్తి చేసి అకౌంట్లు కూడా తీయడం జరిగింది అప్పటి ప్రభుత్వం నిధులను విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగిందని,ప్రభుత్వం మారడం వలన నిధుల విడుదలను జాప్యం జరుగుతుంది నిధులను విడుదల చేయాలని గత 14 నెలల నుంచి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మా నిధులను మాకు ఇవ్వాలని అడిగిన ప్రతిసారి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదని ఇప్పటినుండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని దళిత బంధు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుదామని అన్నారు.ఈ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో దళిత బంద్ అనే పథకాన్ని తొక్కి పెట్టాలని చూస్తుందని ఇది ముమ్మాటికీ దళితులను మభ్య పెట్టాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రని రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు దళితుల ఐక్యతను మీరు చూస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.