
Funds Stalled Until Panchayat Elections
ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్
ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
చిన్న పంచాయతీల పరిస్థితి దారుణం..
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇటు కేంద్రం, అటు ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు ఆగిపోయాయి. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటి వాటి కోసం ఇబ్బందిగా మారింది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని సెక్రటరీలు వాపోతున్నారు. ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అసలే వర్షా కాలం.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతాయని, పారిశుధ్య చర్యలు ఎలా చేపట్టాలో తెలియడం లేదని సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమతమ వుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పల్లెల్లో అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు రావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులుని లిచిపోయాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసినా… రూల్స్ ఒప్పుకోవని చెప్పిన్న ట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా
◆:- మంత్రి సీతక్క విన్నవించినా ససేమిరా
◆:- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.3,600 కోట్లు
◆:- ఎస్ఎఫ్సీ నుంచి మరో రూ.1,500 కోట్లు
◆:- రూ.70 కోట్లకుపైగా స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీల సొంత నిధులతో గ్రామాల్లో పనులు
◆:- బీసీ రిజర్వేషన్ల ఆలస్యంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం
స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నిధులివ్వాలని మంత్రి అడగగా, నిబంధనల ప్రకారం గ్రామాల్లో పాలక వర్గాలు కొలువుతీరితేనే నిధులు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 15 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ ఫండ్ (ఎస్ఎఫ్సీ) రూ.1,500 కోట్లపైనే రావాల్సి ఉండగా.. ఆ నిధులు కూడా పల్లెలకు అందలేదు. దీంతో పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు తమ సొంత నిధులతో పల్లెల్లో అభివద్ధి పనులు చేప డుతున్నారు.
రూ. 3,600 .. కోట్లు పెండింగ్
రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పం చాయతీల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని, 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కసర త్తు చేస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరినా.. కేంద్రం నిరాకరించింది.
రూ. 70 కోట్లకు పైగా సొంత నిధులు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు సైతం 18 నెలలుగా విడుదల కావడం లేదు. మొత్తం రూ.1,560 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో పల్లెల్లో వివిధ పనులకు
తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వాపోయారు. కొన్ని నిధులు స్థానిక రాబడి (పన్నులు, ఫీజులు) నుంచి సమకూరుతున్నా.. అభివృద్ధి పనులకు సరి పోవడం లేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేని పరి స్థితి నెలకొందని చెప్పారు. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర నిధులు కీలక మని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు. ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. నిధులు ఆగిపోవడంతో ఈ చె లింపులు నిలిచిపోయాయి. తాము సొంతంగా ఖర్చు చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు కోరుతున్నారు.