గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కేంద్ర ప్రభుత్వం రైతులు రైతు కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి దేశంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతుందని ప్రజలు రైతులు కార్మికులు సంఘటితంగా పోరాడి రైతు చట్టాల్ని కాపాడుకోవాలని అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు రైతుకు కల్పించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పోలిటీ బూర్యో సభ్యులు కోడెం వెంకటేశ్వర్లు అన్నారు. దేశంలో రైతులు దేశానికి రైతులకు మద్దతు ధర ప్రభుత్వాలు ముందుగాల్ని ప్రకటించాలని రైతుకు గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు పెట్టుబడులు రాక ఎక్కువ పెట్టుబడి పెట్టి గిట్టుబాటు ధర రైతులకు లేక అప్పుల పాలై రైతు కుటుంబాలు కుటుంబాన్ని పోషించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారన్నారు.అదే విధంగా 16, 2,2024 న రైతు కార్మిక సంఘాలు ప్రవేశపెట్టిన భారత బందుకు తుడుం దెబ్బ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా కార్మికులు రైతులు వ్యాపారస్తులు అందరూ సహకరించాలని ఈ యొక్క భారత బందును విజయవంతం చేయాలని కోరారు.