*వట్టెముల గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమన్నీ ప్రారంభించిన ప్రభుత్వ విప్
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.గెలిపించిన ప్రజలకి రుణపడి ఉంటానని.తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, మహిళా సాధికారిత కు ఆరు గ్యారంటీ లు దోహదం చేస్తాయని చెప్పారు. అర్హత గల ప్రతి కుటుంబం అభయహస్తం గ్యారంటీ లకు దరఖాస్తు చేసుకోవాలనీ కోరారు.