
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
మండలం లోని కానిపర్తి,దేశారాజ్ పల్లి, కన్నూర్, గుండేడు,వంగపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను,అయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాబు పరిశీలించాడు.ప్రతి నర్సరీ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని,నూటికి నూరు శాతం జర్మినేషన్ వుండే విధంగా చూడాలని,పండ్లు,పూల మొక్కలతో పాటు రోడ్లకు ఇరు వైపుల నాటే మొక్కలు తప్పని సరిగా పెంచాలని,నర్సరీ వద్ద పెంచే మొక్కల వివరాలు తెలియచేయాలని,నర్సరీల వద్ద నైపుణ్యం వున్న వనసేవకుల ను ఏర్పాటు చేసుకొని పరిరక్షించాలని,పంచాయతి కార్యదర్శి క్షేత్ర సహాయకులు తప్పనిసరిగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమాల ఎంపిడిఓ బాబు, ఎపిఒ రమేష్ బాబు,పంచాయతి కార్యదర్శులు,క్షేత్ర సహాయకులు,సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.