· పరిపాలనా సౌలభ్యం కోసమంటున్న ప్రభుత్వం
· విపక్షాలను దెబ్బతీసే వ్యూహమంటున్న బీఆరఎస్

· హైదరాబాద్ మేయర్ చేజిక్కించుకోవడానికే ఈ వ్యూహం: విపక్షాలు
· కాంగ్రెస్, ఎంఐఎంలకు ప్రయోజనం
· విలీనం చేసే కొత్త ప్రాంతాల్లో రెట్టింపు కానున్న ఇంటి పన్నులు
· వార్డుల సరిహద్దుల విభజన అశాస్త్రీయం: బీజేపీ
· కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్డుల విభజన?
· విభజనపై కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదు
· విభజనతో ఆర్థిక భారం: విమర్శకులు
· ఢిల్లీని విడగొట్టి మళ్లీ విలీనం చేశారు కదా: గుర్తుచేస్తున్న విమర్శకులు
· ఇప్పటికైతే విభజన ఉద్దేశం లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
· కార్పొరేషన్లతో సహా, రాష్ట్రంపై పట్టుకు రేవంత్ దూకుడు
హైదరాబాద్, నేటిధాత్రి:
పస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే జీహెచఎంసీని మొత్తం మూడు కార్పొరేషన్లుగా విడగొట్టాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి, జీహెచఎంసీని హైదరాబాద్ కార్పొరేషన్ (కోర్ సిటీ), సైబరాబాద్ కార్పొరేషన్ (వెస్ట్), మల్కాజ్గిరి కార్పొరేషన్ (తూర్పు) విభాగాలుగా విడగొట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ప్రణాలిక ప్రకారం హైదరాబాద్ కార్పొ రేషన్ పరిధి లో సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోý£్కండ, చార్మినార్, రా జేంద్రనగర్, షంషాబాద్లు వుంటాయి. ప్రస్తుతం లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద వున్న జీహెచఎంసీకార్యాలయమే దీని ప్రధాన కార్యాలయంగా కొనసాగనుంది. ఇక సైబరాబాద్ కార్పొరేషన్లో కూకట్పల్లి, ఖుద్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు వుండనున్నాయి. ఈ కార్పొరేషన్‌ను అధికారికంగా శేరిలింగంపల్లి కార్పొరేషన్‌గా వ్యవహరించే అవకాశముంది. మాదాపూర్‌లోని నేషనలఅకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎనఏసీ)లో దీని కేంద్ర కార్యాలయం పనిచేయనుంది. ఇక మల్కాజ్గిరికార్పొరేషనల్ పరిధిలోకి తూర్పు జోన్ లయిన మల్కాజ్గిరి, ఎల్.బి.నగర్, ఉప్పల్ ప్రాంతాలు వుండనున్నాయి. తార్నాకలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచఎండీఏ) భవనంలో ఈ కార్పొరేష న్ ప్రధాన కార్యాలయం వుండే అవకాశముంది. కౌన్సిల్ రద్దయిన తర్వాత స్పెషల్ కమిషనర్ మొత్తం కార్పొరేషన్ బాధ్యతలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం 2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న జీహెచఎంసీలో మొత్తం 300 వార్డు లుండగా, దీన్ని మూడు కార్పొరేషన్లుగా విభచించిన తర్వాత, హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 150, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో 74 వార్డులు వుండనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ని మొత్తం మూడు యూనిట్లుగా విభజించాలన్న ప్రభుత్వ యోచన వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే పాలనాపరమైన సౌలభ్యతకోసం, ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలన్న లక్ష్యమే ఇం దుకు కారణమని ప్రభుత్వం చెబుతున్నా, విపక్షాలు ముఖ్యంగా బీఆరఎస్ మాత్రం ఈ ఆలోచన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వం ప్రస్తుతం వున్న జీహెచఎంసీని మూడు భాగాలుగా అంటే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు విడగొట్టాలని యోచిస్తున్నది. ఈవిధంగాచిన్న యూనిట్లుగా విడగొట్టడం వెనుక విపక్షాల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న రాజకీయ లక్ష్యం వున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవిధంగా విడగొట్టిన మూడు కార్పొరేషన్లపై తన పట్టును మరింత బలంగా విస్తరించవచ్చునన్నది రేవంత్ ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. 2023ఎన్నికల్లో బీఆరఎస్ మంచి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాలను ముÅ£్కలు చేయడం ద్వారా పార్టీ నడ్డి విరవడమే కాకుండా కాంగ్రెస్‌ను బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా రూపొందించే వ్యూహం దీని వెనుక వున్నదని తెలుస్తోంది. ఈ పునర్విభజన కాంగ్రెస్‌కు అనుకూలమైన రీతిలో వుండే విధంగా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ట బోయే ఈ ప్రక్రియలో ఆల్ ఇండియా ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఒక జోన్లో అ త్యంత శక్తివంతమైనదిగా రూపొందడమే కాదు, కింగ్‌మేకర్ పాత్రను పోషించనుంది. అయితే ప్రభుత్వం స్వార్థంతో కొన్ని వనరులు, భూమిపై ఆధిపత్యం సంపాదించేందుకే ఇటువంటి నిర్ణ యం తీసుకుంటోందని, బీఆరఎస్ సహా విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ని యంతత్వ వైఖరికి నిదర్శనం తప్ప మరోటి కాదని విమర్శిస్తున్నారు. ఇది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దోహదం చేస్తుందన్నది వీరి వాదన. ఇందుకు ఉదాహరణగా ఢిల్లీని చూపుతున్నారు. గతంలో మెరుగైన పాలన పేరుతో దేశరాజధాని నగరాన్ని ఇదే విధంగా విభజించిన తర్వాత తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా విభజన నిర్ణయం సముచితం కాదని అర్థమై ఎట్టకేలకు నగరాన్ని మొత్తం ఏకం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దష్టిలో పెట్టుకోవాలని వీరు గట్టిగా చెబుతున్నారు.
కేవలం కాంగ్రెస్, ఎంఐఎంలకు ప్రయోజనం చేకూర్చే రీతిలో జీహెచఎంసీని మూడు విభాగాలుగా విడగొడుతున్నారని బీఆరఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఇది పూర్తి అశాస్త్రీయమైన విభజనఅంటూ ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకోసం కూడా ప్రభుత్వం ఈ విభజన ప్రక్రియకు తెరతీసిందని ఆరోపిస్తున్నాయి. కొత్తగా వీలీనమయ్యే ప్రాంతాల విషయంలో పారదర్శకత లేకపోవడం, పెరిగిన పన్నుల భారాలు, మౌలిక సదుపాయాల అంశాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలపైఈ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విభజనవల్ల మేయర్ పదవి కాంగ్రెస్, ఎంఐఎంలచేతుల్లోకి వెళుతుందని, అధిక విలువలున్న భూములను నియంత్రించే దురుద్దేశంతోనే ప్రభుత్వంఈ అనైతిక విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టిందంటూ బీజేపీ విమర్శిస్తోంది. దీన్ని అభివద్ధి ప్రాజెక్టు అనేదానికంటే “రెడ్ ఎస్టేట” ప్రాజెక్టు అని పిలవొచ్చని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అంతేకాదు కొత్త వార్డుల సరిహద్దులను సరైన సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా గీసారని, ఫలితంగా ప్రస్తుతమున్న పరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోవడమే కాదు, తమకు గట్టి బలం వున్న ప్రాంతాలు విభజన చెందడంవల్ల పట్టు కోల్పోతామన్న ఆందోళనను బీఆరఎస్, బీజేపీలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు కార్పొరేషన్లలో కొత్తగా చేర్చే ప్రాంతాలకు చెందిన ప్రజలు, ఇప్పటికీ ఎటువంటి మౌలిక వసతులు ఏర్పడనప్పటికీ, రెట్టింపు ఇంటి పన్నులు కట్టాల్సి వస్తుందన్న ఆం దోళన వ్యక్తమవుతోంది. ఏవిధమైన విస్తరణలేని ప్రస్తుత జీహెచఎంసీలోనే మౌలిక సదుపాయా లు అరకొరగా వున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు విస్తరణ పేరుతో కొత్త ప్రాంతాలను కూడా కలిపేయడం వల్ల మౌలిక వసతుల పరంగా కార్పొరేషన్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందన్న విమర్శ లున్నాయి. ముఖ్యంగా రోడ్లు, పారిశుద్ధ్యం, నీటి వసతుల కల్పన పరంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీకాకుండా ఇంతపెద్ద ప్రక్రియ చేపడుతున్నప్పుడు ప్రభుత్వం విపక్షాలను, ఆయా ప్రాంతాల ప్రజలను సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలి తప్ప, ఏకపక్షంగావిభజన చేయడం ఎంతవరకు సమంజసమన్నది అసలు ప్రశ్న.
జీహెచఎంసీపై తాను తీసుకోబోయే నిర్ణయం విషయంపై వస్తున్న విమర్శలను ప్రభుత్వం ఖాత చేయడంలేదు. మెరుగైన పాలనతో పాటు ప్రజలకు మంచి పాలన అందించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేస్తోంది. విచిత్రమేమంటే కాంగ్రెస్‌లోనే ఈ నిర్ణయంపై విభేదా లున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇటువంటి కీలక నిర్ణయం తీసుకునేముందు తమ అభిప్రా యాలను పరిగణలోకి తీసుకోలేదని కొందరు నాయకులు మదనపడుతున్నట్టు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది రేవంత్ తీసుకోబోయే ఈ నిర్ణయాన్ని కేవలం ఏకపక్షమని, రాజకీయ ప్రయోజనాలమాట అట్లావుంచి దీర్ఘకాలంలో ఇప్పుడు మనం అంచనా వేయలేని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈనిర్ణయం బూమరాంగ్ అయితే సరిదిద్దుకోలేని తప్పుగా మారుతుందని కూడా వారు భయపడు తున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం తప్పని భావించి మళ్లీ జీహెచఎంసీని ఏకం చేయాలనుకున్నా ఢిల్లీలో మాదిరిగా ముక్కలు చేసిన వాటిని తిరిగి ఏకం చేయడం దుస్సాధ్యమన్నది కూడా వారి అభి ప్రాయంగా కనిపిస్తున్నది. ఇదిలావుండగా జీహెచఎంసీని మూడు ప్రాంతాలుగా విడగొట్టట్టే అంశంపై ఈ ఏడాది ప్రారం భంలో సీరియస్‌గా చర్చించినప్పటికీ, విభజన ప్రక్రియకు సంబంధించిఒక నిర్ణయానికి రానట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తు న్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నే కొందరు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, మరికొందరు సమ ర్థించినట్టు చెబుతున్నారు. ప్రస్తుత జీహెచఎంసీ పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఒకనిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఈనెల 10వ తేదీతో జీహెచఎంసీ టర్మ్ ముగిసిపోతున్న నేపథ్యంలో, ఐ.టి.శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికైతే జీహెచఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడ గొట్టే ఆలో చన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేయడం కొసమెరుపు!
