
చందుర్తి, నేటిధాత్రి :
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎస్ పార్టీ పాత్ర అజరామరం. రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయంగా పార్టీ స్థాపించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనంలో తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు, నీళ్లు తరలిపోవడంతో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తట్టి లేపారు. దీనికిగాను ప్రతి గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన లీడర్లు అందరూ ఏకతాటి పైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు కొట్లాడారు. అందులో ఒకరు చందుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య. దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చొక్కా రావు సహచరుడుగా పనిచేసిన ఆయన ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన కాంక్షతో కెసిఆర్ నాయకత్వంలోని ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో సవాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సాగిన ఉద్యమంలో రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వెంగల కొమురయ్య దాదాపు 100కు పైగా వివిధ రకాల నిరసనలు తెలుపగా ఆయన వెన్నంటి ఉన్నారు. ఇలా ఉద్యమ కాలంలో మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు స్పందిస్తూ జనాలని పోగుచేస్తూ రోడ్లపై వంటావార్పు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి పగ్గాలు చేపట్టాక పార్టీలోనే ఉంటూ పలు రకాల సమస్యలపై స్పందించారు. అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ మండలంలోని వివిధ రకాల సమస్యలపై గొంతు ఎత్తారు. ముఖ్యంగా మండల కేంద్రం నుండి మోత్కరావుపేట గ్రామానికి వెళ్లే రహదారి సాధనకై అతని కృషి అంతా కాదు. టిఆర్ఎస్ నాయకురాలు తులా ఉమాకి కుడి భుజంగా ఉన్న ఆయన తదనంతరం పలు కారణాలవల్ల టిఆర్ఎస్ పార్టీని విడి తుల ఉమా తో కలిసి బిజెపిలో చేరారు . అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయాలని ఉద్దేశంతో మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికై రైతుల సమస్యలపై పోరాటాలు జరిపారు. తగినంతరం జరిగిన పరిణామాల వల్ల మళ్లీ తుల ఉమా తో కలిసి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి నుండి నేటి వరకు పార్టీ కోసం పనిచేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎంపీ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా అలుపెరగని కృషి చేస్తున్నారు. ఈ విధంగా నాటినుండి నేటి వరకు తాను గులాబీ జెండాకు చెందిన వాడిని, దానికోసమే పని చేస్తానని నిరూపిస్తున్నారు. ఈ ఎన్నికలలో వినోద్ కుమార్ గెలుపు కోసం పనిచేస్తున్న అతని కృషి ఫలించాలని ఆశిద్దాం…