
పేదరికం నుండి పెద్ద చదువుల వరకు
అంగవైకల్యం అసలు అడ్డే కాదు
అంగవైకల్యాన్ని అధిగమించి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్న బొల్లారం సంజీవ్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన బొల్లారం అగమ్మ లింగయ్య దంపతుల మూడవ సంతానం సంజీవ్, పుట్టుకతోనే శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ, జీవితంపై నమ్మకంతో,విద్యపై తపనతో తనను తాను తీర్చిదిద్దుకున్న ఉత్తమ ఉదాహరణ,ఆయన చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను,ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని,ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో దొమ్మటి రాజేందర్ మరియు స్నేహితులు ఆత్మస్థైర్యం అందించి ప్రోత్సహించారు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొని విద్యాబ్యాసం
ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువుపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాడు.తల్లిని కోల్పోయిన సంజీవ్ ఆ బాధను దిగమింగుకుంటూనే విద్యను తన సాధనంగా మలుచుకున్నాడు.ఇటు చదువుకొనసాగిస్తూనే కీ
కొద్ది సంవత్సరాలు,వరంగల్ సెంట్రల్ జైలులో సైకాలాజి కౌన్సిలర్ గా కొద్దిరోజులు సేవాలందించారు.తనకు వచ్చిన చిన్న చిన్న పనులను చేసుకుంటూ ఒకరిమీద ఆధారపడకుండా తన జీవితాన్ని కొనసాగించాడు,క్రమంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ,పోరాట పంథాలోనే ప్రగతి సాధించాడు.
గవర్నర్ చేతులమీదుగా డాక్టరేట్
సూపర్వైజర్ ఆచార్య తక్కలపెల్లి.దయాకర్ రావు ఆధ్వర్యంలో పూర్తి చేసి ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న 23వ కన్వొకేషన్ సభలో,పిహెచ్డి(డాక్టరేట్) సోమవారం రోజున రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయమే కాదు ఇది సమాజానికి ఒక స్పష్టమైన సందేశం “అంగవైకల్యం శరీరానికి మాత్రమే.మనసు,విజ్ఞానం, కలలకి కాదు”అనే వాక్యం సంజీవ్ జీవితంలో పటిష్ఠంగా నిలిచింది.కుటుంబ పరిస్థితులు,శారీరక సమస్యలు,పర్యావరణ అడ్డంకులు అన్నిటినీ దాటి తన స్థానం సంపాదించుకున్న ఆయన అంగవైకల్యం ఉన్న విద్యార్థులకే కాదు,ప్రతీ సామాన్య యువకునికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సంజీవ్ విద్యతోపాటు సామాజిక స్పృహతో కూడిన వ్యక్తిగా, ఇతర దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తూ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.ఈ క్షణం,అయన జీవితంలోని ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ సందర్భంగా సంజీవ్ ని సత్కరించి,ఆయన విజయాన్ని గర్వంగా గుర్తించాల్సిన అవసరం సమాజంపై ఉంది.ఆయన జీవిత ప్రయాణం పరిమితి ఉన్న శరీరం,అపరిమితమైన ఆశయాల మధ్య జరిగే ఓ గొప్ప పోరాటమని చెప్పవచ్చు.
ఈ కార్యంతో మాగ్రామానికి యువతకు ఆదర్శప్రాయంగా ఉంటాడు-కాలనీ వాసులు
బొల్లారం సంజీవ గవర్నర్ చేతులమీదుగా పిహెచ్డి అందుకోవడం చాలా గర్వంగా ఉంది.మేము చిన్నత్తనంనుండి సంజీవ ను చూస్తువస్తున్నాం పేదరికంలో పుట్టి పెరిగి అంగవైకల్యం ఉన్నప్పటికీ అనేక కష్టాలు పడి పేదరికంతో పోరాడి కస్టపడి చదివి ఈ స్థాయికీ చేరుకోవడం మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందకరంగా ఉన్నదని మా గ్రామం తరుపున మా కాలనీ తరుపున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.