* ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా……..
బి ఆర్ ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం
* కేటీఆర్ యువసేనమండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలో గురువారం రోజునవిలేకరుల సమావేశంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం ధ్యేయంగా 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన టిఆర్ఎస్ (బిఆర్ఎస్ ) ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తిరుగులేని విజయాలు ఉన్నాయి టిఆర్ఎస్ పురుడు పోసుకుని బి ఆర్ఎస్ గా రూపాంతం చెందిన పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.