
“FRO Tejasvi Provides Financial Aid to Bereaved Family”
మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…
తను ఒక ఆడపిల్లనని గర్వించి ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో మానవత్వం చాటుకున్న ఎడుల్ల బయ్యారం ఎఫ్ ఆర్ ఓ తేజస్వి కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్లో ఉంటూ నిన్న రాత్రి హైదరాబాదులో మరణించారు అతనికి ముగ్గురు ఆడపిల్లలే వాళ్లు కూడా చిన్నవారని తెలుసుకున్న మహిళా అధికారిని ఏడుల బయ్యారం రేంజ్ ఎఫ్ఆర్ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడి ద్వారా అందించడం జరిగినది, ఆడపిల్లలు ఎప్పుడు కూడాను తల్లిదండ్రులకి భారం కాకూడదని తన మనోవేదన ద్వారా తెలియజేయడం జరిగినది కనుక కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అని ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి తనదైన శైలిలో తెలియజేయడం జరిగినది.
, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు
పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు
గ్రామ పెద్ద మనుషులు బంధువులు తదితరులు పాల్గొన్నారు